Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా దేహమును నీ ఆలయముగా నిర్మించి Telugu Christian Song Lyrics

నా దేహమును నీ ఆలయముగా నిర్మించి Lyrics


నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుము
నే సమర్పింతును నీకు నా దేహము సజీవయాగముగా ప్రభు
యేసు నాలో నీవు ఉంటే – నీ సంపదలు నా సొంతమే
యేసు నీలో నేను ఉంటే – నా బ్రతుకంతా సంతోషమే     ||నా దేహమును||

నాలో నీ సన్నిధి ఉందని
గ్రహియించు జ్ఞానమును కలిగుంచుము
నా దేహమును భయముతో భక్తితో
నీ కొరకు పరిశుద్ధముగా దాచెద
ఈ లోకములో జనముల ఎదుట మాదిరిగా జీవింతును
నా దేహముతో నీ నామమును ఘనపరతును నిత్యము     ||నా దేహమును||

నీ జీవ ప్రవాహము ప్రవహించనీ
నాలోని అణువణువు చిగురించును
ఫలియించు ద్రాక్షావల్లి వలె నేను
విస్తారముగా దేవా ఫలియింతును
నా దీవెనగా నీవు ఉంటే నాకేమైనా కొదువుండునా
ఈ లోకముకు నన్ను నీవు దీవెనగా మార్చు ప్రభు     ||నా దేహమును||

Your favourites

  • No Favourites found!