Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా గీతారాధనలోయేసయ్యా నీ కృప ఆధారమేనా Telugu Christian Song Lyrics

నా గీతారాధనలోయేసయ్యా నీ కృప ఆధారమేనా Lyrics

నా గీతారాధనలో-యేసయ్యా నీ కృప ఆధారమే
నా ఆవేదనలలో-జనించెనే నీ కృపాదరణ
1.నీ కృప నాలో వ్యర్థము కాలేదు- నీ కృపా వాక్యమే
చేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే
నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే ||నా గీతా||
2.చేనిలోని పైరు చేతికిరాకున్నా- ఫలములన్ని రాలిపోయిన
సిరిసంపదలన్నీ దూరమైపోయిన-నేను చల్లించనులే
నిశ్చలమైన రాజ్యముకొరకే- ఎల్లవేళల నిన్నే ఆరాధింతునే ||నా గీతా||
3.ఆత్మాభిషేకం-నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించెనే
ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసెనే
ఆత్మతో సత్యముతో ఆరాధించుచు-నే వేచియుందునే నీ రాకడకై ||నా గీతా||

Your favourites

  • No Favourites found!