Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా జీవిత కాలమంతనిను కీర్తించిన చాలునానా Telugu Christian Song Lyrics

నా జీవిత కాలమంతనిను కీర్తించిన చాలునానా Lyrics

నా జీవిత కాలమంత
నిను కీర్తించిన చాలునా
నా సమస్త సంపద
నీకిచ్చిన చాలునా
యేసు నీదు మేలులకై
నే బదులుగా యేమిత్తును
నా దేహమే యాగముగా
అర్పించిన చాలునా ||నా జీవిత||
చరణం 1
నా బాల్యమంతా - నా తోడుగా నిలచి
ప్రతి కీడునుండి - తప్పించినావు
యవ్వన కాలమున - నే త్రోవ తొలగిన
మన్నించి నాతోనే - కొనసాగినావు
ఎన్నో శ్రమలు - ఆపదలన్నిటిలో
నను ధైర్యపరచి - నను ఆదుకున్నావు
యేసు నీవే - నీవే యేసు
నీవే నా - సర్వస్వమూ... ||నా జీవిత||
చరణం 2
కన్నీటి రాత్రులు - నే గదిపిన వెంటనే
సంతోష ఉదయాలు - నాకిచ్చినావు
హృదయాశలన్నీ - నేరవెర్చినావు
యొగ్యుడను కాక్నున్న - హెచ్చించినావు
ఎంతో ప్రేమ - మితిలేని కృపను
నాపై చూపించి - నను హత్తుకున్నావు
యేసు నీవే - నీవే యేసు
నీవే నా - ఆనందమూ... ||నా జీవిత||

Your favourites

  • No Favourites found!