Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా జీవిత వ్యధలందు యేసే జవాబు Telugu Christian Song Lyrics

నా జీవిత వ్యధలందు యేసే జవాబు Lyrics


నా జీవిత వ్యధలందు యేసే జవాబు
యేసే జవాబు – ప్రభు యేసే జవాబు (2)       ||నా జీవిత||

తీరని మమతలతో ఆరని మంటలలో
ఆశ నిరాశలతో తూలెను నా బ్రతుకే (2)
నను గని వచ్చెను – తన కృప నిచ్చెను
కరుణతో ప్రేమించి – కలుషము బాపెను        ||నా జీవిత||

చీకటి వీధులలో నీటుగా నడచితిని
లోకపు ఉచ్ఛులలో శోకము జూచితిని (2)
నను గని వచ్చెను – తన కృప నిచ్చెను
కరుణతో ప్రేమించి – కలుషము బాపెను        ||నా జీవిత||

హంగుల వేషముతో రంగుల వలయములో
నింగికి నేనెగిరి నేలను రాలితిని (2)
నను గని వచ్చెను – తన కృప నిచ్చెను
కరుణతో ప్రేమించి – కలుషము బాపెను        ||నా జీవిత||

Your favourites

  • No Favourites found!