Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా కలవరములన్ని కనుమరుగు చేసినావునా కన్నీళ్లు Telugu Christian Song Lyrics

నా కలవరములన్ని కనుమరుగు చేసినావునా కన్నీళ్లు Lyrics

నా కలవరములన్ని కనుమరుగు చేసినావు
నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి కవిలెలో వ్రాసినావు – (2)
నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||
నీ చేయి నన్ను సంరక్షించెను
నా శత్రువులు కీడు చేయలేకపోయిరి (2)
నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||
యెహోవా యుద్ధములు చేయుటకు కృపనిచ్చితివి
శాశ్వతమైన సంతతిని స్వాస్థ్యముగా నాకిచ్చితివి (2)
నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||
బ్రతుకు దినములన్నిటను అపాయమే రాదు
జీవిత కాలమంతా నాకు కీడే లేదు (2)
నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||
నిన్ను నమ్మువారు సీయోనులో చేరి
నిత్యానందపు భాగ్యమును పొందెదరు (2)
నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||

Your favourites

  • No Favourites found!