Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా కనుచూపు మేర Telugu Christian Song Lyrics

నా కనుచూపు మేర Lyrics


నా కనుచూపు మేర – యేసు నీ ప్రేమ
పొంగి పారెనే – పొంగి పారెనే (2)
నే ప్రేమింతును – నా యేసుని మనసారా (2)
ఆరిపోవు లోక ప్రేమల కన్నా
ఆదరించు క్రీస్తు ప్రేమే మిన్న (2)      ||నా కనుచూపు||

నా కన్నీటిని తుడిచినా ప్రేమ
నలిగిన నా హృదయాన్ని కోరిన ప్రేమ (2)
ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ
నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2)      ||నా కనుచూపు||

నా దీన స్థితిని చూచిన ప్రేమ
తన శాశ్వత ప్రేమతో (నను) పిలిచిన ప్రేమ (2)
ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ
నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2)      ||నా కనుచూపు||

నా భారంబును మోసిన ప్రేమ
సిలువలో నాకై చేతులు చాచిన ప్రేమ (2)
ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ
నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2)      ||నా కనుచూపు||

Your favourites

  • No Favourites found!