Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా కొరకై అన్నియు Telugu Christian Song Lyrics

నా కొరకై అన్నియు Lyrics


నా కొరకై అన్నియు చేసెను యేసు
నాకింకా భయము లేదు లోకములో (2)
నా కొరకై అన్నియు చేసినందులకు (2)
నేను – రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదన్ (2)       ||నా కొరకై||

క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను
క్షామం తీర్చి ఏలీయాని ఆశీర్వదించెన్ (2)
క్షామం తీరే వరకు ఆ విధవరాలి (2)
ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు (2)       ||నా కొరకై||

ఆకాశ పక్షులను గమనించుడి
విత్తవు అవి పంట కోయవు (2)
వాటిని పోషించునట్టి పరమ పితా (2)
మమ్ము – అనుదినం అద్భుతముగా నడుపును (2)       ||నా కొరకై||

ఏమి ధరింతుమని చింతపడకు
అడవి పువ్వులను తేరి చూడుము (2)
అడవి పువ్వుల ప్రభు అలంకరింప (2)
తానె – నిశ్చయముగా అలంకరించును (2)       ||నా కొరకై||

రేపటి దినము గూర్చి చింత పడకు
ఆప్తుడేసు నాకుండ భయము ఎందుకు (2)
రేపు దాని సంగతులనదే చింతించున్ (2)
ఏ – నాటి కీడు ఆనాటికే ఇల చాలును (2)       ||నా కొరకై||

ఆశీర్వదించెడి యేసు అరణ్యములో
పోషించెను ఐదు వేల మందిని కూడా (2)
తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ (2)
యేసు – తన్ను తానే అర్పించెను నా కొరకై (2)       ||నా కొరకై||

Your favourites

  • No Favourites found!