Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా కొఱకుఁ చనిపోయి నాఁడ ఆద Telugu Christian Song Lyrics

నా కొఱకుఁ చనిపోయి నాఁడ ఆద Lyrics

నా కొఱకుఁ చనిపోయి నాఁడ ఆద యాకరుండిరు వంక దొంగలతోడ
||నా కొఱకు||

1. ఆలకింపగను మనసార నాకు నానదే యా దయామృత సారధార
భూలోకమునఁదనివిఁ దీర నిట్టి పుణ్యాత్ము నేమఱక పూజింతు మీర ||నా కొఱకు||

2. కన్న తలిదండ్రులకు నైన యింత ఘన వత్సలత నేఁ గల్గుటంగాన
విన్నదియులేదు చెవులూన స్వామి విక్రయంబై కొర్త వేదనలతోను ||నా
కొఱకు||

3. కీటకమువంటి ననుఁ బ్రోవ సొంత కీలాలమర్పించి ఖేదపడిచావ
వాటమా తన కిటులఁ గావ నేను వర్ణింపఁ గన్నీరు వరదలైపోవ
||నా కొఱకు||

4. ఘోరముగ నినుపమేకులను గ్రుచ్చి కొంకకానిర్దయుల్ గొల్గొతా
మనలను మారణంబగు నవస్థలను బెట్ట మాదృశాత్మన్గావ
మౌనమైయిలను ||నా కొఱకు||

5. ఏమి బహుమతుల నర్పింతు నట్టి స్వామిమేళ్లల్ల నా స్వాంతమున
నుంతున్ ప్రేమ భావమున వర్తింతున్ నిత్య కామితార్థం బిడు
కర్తను భజింతున్ ||నా కొఱకు||

6. చేయనిఁక పాప సంగతము నాఁడు సిలువపైఁ జచ్చిన శ్రీకరుని
కతము పాయ కాబ్రభుసత్యవ్రతము నాధు ప్రాణాంత మౌదాఁక ప్రార్థింతు
సతము ||నా కొఱకు||

Your favourites

  • No Favourites found!