Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా ఊహకందని ప్రేమతో నన్ను నీవు Telugu Christian Song Lyrics

నా ఊహకందని ప్రేమతో నన్ను నీవు Lyrics

నా ఊహకందని ప్రేమతో నన్ను నీవు పిలిచావు
ఆ ప్రేమలోనే నన్ను నీలోనే నిలిపావు (2)
నాలోన నీవున్నావు – నీలోన నను దాచావు
నీ సాక్షిగా నను నిలిపావు (2) ||నా ఊహకందని||
అందరు నన్ను చూచి నీ బ్రతుకు మారదని
దూరాన నిలచి నన్ను చూచి నవ్వారే (2)
ఏనాడు అనుకోలేదు
నన్ను నీవు ఎన్నుకుంటావని (2) ||నా ఊహకందని||
జీవితమంతా శూన్యమైపోగా
నాకున్న వారే నన్ను విడచిపోగా (2)
ఏనాడు అనుకోలేదు
నాకు తోడుగా నీవుంటావని (2) ||నా ఊహకందని||
నా జీవితాన్ని నీవు మార్చినావు
నీ సేవలోనే నన్ను నిల్పినావు (2)
ఏనాడు అనుకోలేదు
నా జీవితం ఇలా మారుతుందని (2) ||నా ఊహకందని||

Your favourites

  • No Favourites found!