Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా ప్రాణప్రియుడా యేసురాజా అర్పింతును నా Telugu Christian Song Lyrics

నా ప్రాణప్రియుడా యేసురాజా అర్పింతును నా Lyrics


నా ప్రాణప్రియుడా యేసురాజా
అర్పింతును నా హృదయార్పణ
విరిగి నలిగిన ఆత్మతోను
హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా

అద్భుతకరుడా ఆలోచన
ఆశ్చర్య సమాధాన ప్రభువా
బలవంతుడా బహుప్రియుడా
మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్          ||నా ప్రాణ||

విమోచన గానములతో
సౌందర్య ప్రేమ స్తుతులతో
నమస్కరించి ఆరాధింతున్
హర్షింతును నే పాడెదను నా ప్రభువా               ||నా ప్రాణ||

గర్భమున పుట్టిన బిడ్డలన్
కరుణింపక తల్లి మరచునా
మరచినగాని నీవెన్నడు
మరువవు విడువవు ఎడబాయవు కరుణ రాజా  ||నా ప్రాణ||

రక్షణాలంకారములను
అక్షయమగు నీ యాహారమున్
రక్షకుడా నాకొసగితివి
దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును              ||నా ప్రాణ||

నీ నీతిని నీ రక్షణను
నా పెదవులు ప్రకటించును
కృతజ్ఞతా స్తుతులతోడ
నీ ప్రేమను నే వివరింతును విమోచకా              ||నా ప్రాణ||

వాగ్ధానముల్ నాలో నెరవేరెను
విమోచించి నాకిచ్చితివే
పాడెదను ప్రహర్షింతును
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా           ||నా ప్రాణ||

Your favourites

  • No Favourites found!