నా ప్రాణ ప్రియుడా యేసురాజా
అర్పింతును నా హృదయార్పణ
విరిగి నలిగిన ఆత్మతోను
హృదయపూర్వక ఆరాధనతో - సత్యముగా
1. అధ్భుతకరుడా ఆలోచన - ఆశ్చర్య సమాధాన ప్రభువా
బలవంతుడా బహు ప్రియుడా
మనోహరుడా మహిమరాజా - స్తుతించెదన్
2. విమోచన గానములతో - సౌందర్య ప్రేమ స్తుతులతో
నమస్కరించి ఆరాధింతున్
హర్షింతును నే పాడెదను నా ప్రభువా
3. గర్భమున పుట్టిన బిడ్డను - కరుణింపక తల్లి మరచునా
మరచిన గాని నీవెన్నడు
మరువవు విడివవు ఎడబాయవు - కరుణారాజా
4. రక్షణాలంకారములను - అక్షయమగు నీ యాహారమున్
రక్షకుడా నా కొసగితివి
ధీక్షతో నిన్ను వీక్షించుచు - స్తుతింతును
5. నీ నీతిని నీ రక్షణను - నా పెదవులు ప్రకటించును
కృతజ్ఞతా స్తుతుల తోడ
నీ ప్రేమను నే వివరింతును - విమోచకుడా
6. వాగ్దానముల్ నీలో నెరవేరెను - విమోచించి నా కిచ్చితివే
పాడెదను ప్రహర్షింతును
హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నా ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పింతును Lyrics
Your favourites
- No Favourites found!
