నా ప్రాణం నీ ప్రాణముతో
ఎన్నటికీ పెనవేసుకొనెను
నా సర్వం కృపాసహితమై
నీకు అర్పించబడెను
నిన్ను సేవించని క్షణమున
నా ప్రాణము తల్లడిల్లిపోవును
1. యాకోబుతో నీవు చేసిన నిబంధన
జ్ఞాపకము చేసుకొని హెచ్చించినావు
అన్నిటిని నీవు మరచితివే
శత్రువుల చేతి నుండి కాపాడి జయమిచ్చినావు
ఆలస్యము ఎప్పుడు అలక్ష్యము కాదులే
2. నీ యెడల నాకున్న ఆశలను
జ్ఞాపకము చేసుకొని దీవించి స్థిరపరచినావు
నా దోషములన్నిటిని క్షమించితివే
శత్రువుల చేతి నుండి కాపాడి నెమ్మదిచ్చినావు
వేచియుండుట ఎప్పుడు సిగ్గుపరచుట కాదులే
3. ఆరోగ్యకరమైన దేహమును
నాణ్యత తగ్గని అవయవములనిచ్చినావు
వైద్యమును నేను మరచితిని
శత్రువుల చేతి నుండి కాపాడి దీర్గాయు విచ్చితివి
శ్రమ నొందుట ఎప్పుడు కీడు కాదులే ఎన్నడు
4. ఓటమే ఎన్నడు ఎరుగని
జయ జీవితమును నాకిచ్చినావు
కనుమరుగు చేసి విఘాతములన్
శత్రువుల చేతి నుండి కాపాడి సంరక్షించితివి
ప్రార్ధించుట ఎన్నడు అపజయమును ఇవ్వదు
