నా ప్రాణప్రియుడా యేసు రాజా
అర్పింతును నా హృదయార్పణ
విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా
1. అద్భుతకరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా
బలవంతుడా బ..హు ప్రియుడా
మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్ ||నా ప్రాణ||
2. విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో
నమస్కరించి ఆరాధింతున్
హర్షింతును నే పాడెదను నా ప్రభువా ||నా ప్రాణ||
3. గర్భమున పుట్టిన బిడ్డలన్ కరుణింపక తల్లి మరచునా
మరచినగాని నీవెన్నడు
మరువవు విడువవు ఎడబాయవు కరుణ రాజా ||నా ప్రాణ||
4. రక్షణాలంకారములను అక్షయమగు నీ యాహారమున్
రక్షకుడా నా కొసగితివి
దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును ||నా ప్రాణ||
5. నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును
కృతజ్ఞతాస్తు... తుల తోడ
నీ ప్రేమను నే వివరింతును విమోచకా ||నా ప్రాణ||
6. వాగ్దానముల్ నాలో నెరవేరెన్ విమోచించి నా కిచ్చితివే
పాడెదను ప్రహర్షింతును
హల్లెలూయ హల్లెలూయ ||నా ప్రాణ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నా ప్రాణప్రియుడా యేసు రాజాఅర్పింతును నా Lyrics
Your favourites
- No Favourites found!
