నా రక్షకా యేసునాధ ఇమ్మానుయేలు ఘోర పాపుల పాప భార విమోచక
||నా రక్షకా||
1. నిత్యకాలమునందు నిజమైన దేవుని సత్యవాక్యమై యున్న స్వామి
నిన్నుతియింతు ||నా రక్షకా||
2. సర్వ లోకంబులను సత్యవాక్యమై యుండి నిర్వహించిన దేవుని
నిజబాహువా స్తుతింతు ||నా రక్షకా||
3. దేవజనులకు సువార్త దెలుప నభిషేకంబు పూని నొందిన దేవపుత్రుడ
నుతియింతు ||నా రక్షకా||
4. దేవ మహిమ ప్రకాశ దీనరక్షక మాను ష్యావతారము దాల్చి
యావదాజ్ఞల దీర్చిన ||నా రక్షకా||
5. పావనాద్భుతుడవై పరమ జ్ఞానము దెల్పిన దేవస్వభావ ముద్ర
దేదీప్యుడా స్తుతింతు ||నా రక్షకా||
6. పాపాత్ములను గావ శాపభారము క్రింద నోపికతో నిల్చి ప్రాపు
జూపిన ప్రభువా ||నా రక్షకా||
7. ఈ వసుధను ప్రేమ నెసగునట్లుగ జూపి చావు గెల్చిన సర్వ సామర్థ్యుడా
స్తుతింతు ||నా రక్షకా||
8. ఘన దేవుని కుడి పార్శ్వమున గూర్చుండి విజ్ఞప్తి నొనరించు నా యేసు
వినయ స్తోత్రంబిదిగో ||నా రక్షకా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నా రక్షకా యేసునాధ ఇమ్మానుయేలు ఘోర Lyrics
Your favourites
- No Favourites found!
