Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా సంకట దుఃఖములెల్ల తీరిపోయెగా నశింపజేయు Telugu Christian Song Lyrics

నా సంకట దుఃఖములెల్ల తీరిపోయెగా నశింపజేయు Lyrics


నా సంకట దుఃఖములెల్ల తీరిపోయెగా
నశింపజేయు దూత నన్ను దాటిపోయెను (2)   ||నా సంకట||

విలువైన గొర్రెపిల్ల రక్తము ద్వారా (2)
కలిగియున్న రక్షణలో దాగియుంటిని (2)           ||నా సంకట||

ఇంకా నేను ఫరోకు దాసుడను కాను (2)
ఇంకా నేను సీయోను కన్యుడను గాను (2)           ||నా సంకట||

మార్చబడు నాడు మారా మధురముగా (2)
పారు జలము బండనుండి త్రాగుచుండును (2)           ||నా సంకట||

సౌందర్యమయమగు పరమ కానాను (2)
నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పుజెందదు (2)           ||నా సంకట||

ఆనందమే పరమానందమే (2)
కానాను జీవితము నా కానందమే (2)           ||నా సంకట||

నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు (2)
నా దేవుడిచ్చు క్రొత్త మన్నా నాకు చాలును (2)           ||నా సంకట||

నా యేసు ప్రభువే నా బలము గానము (2)
నా యేసు ప్రభువే నా రక్షణ హల్లెలూయా (2)           ||నా సంకట||

Your favourites

  • No Favourites found!