Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీతో స్నేహం నే మరువగలనా నిన్ను Telugu Christian Song Lyrics

నీతో స్నేహం నే మరువగలనా నిన్ను Lyrics


నీతో స్నేహం నే మరువగలనా
నిన్ను విడచి నేను ఉండగలనా
నీతో స్నేహం నే మరువగలనా
నా స్నేహితుడా… నా యేసయ్యా (2)
విడువక నను ఎడబాయని నేస్తమా         ||నీతో||

నా నీడగా నీవుండగా – భయమేమీ లేదుగా
శోధనకైనా బాధలకైనా భయపడిపోనుగా
శత్రువు నన్ను వేధించినా – నా ధైర్యం నీవేగా
లోకం నన్ను దూషించినా – నన్ను విడువవుగా
కన్నీరు తుడిచే నా నేస్తం నీవేగా
ఓదార్చి నడిపించే స్నేహితుడవు నీవేగా           ||నా స్నేహితుడా||

నా తోడుగా నీవుండగా – కొదువేమి లేదుగా
కష్టములైనా నష్టములైనా – తడబడిపోనుగా
అపాయమేమి రాకుండగా – కాచేవాడవు నీవేగా
ఎన్నటికైనా మారని నీదు – స్నేహమే మధురముగా
ప్రేమను పంచిన నా నేస్తం నీవేగా
ప్రాణాన్నే ఇచ్చిన స్నేహితుడవు నీవేగా          ||నా స్నేహితుడా||

Your favourites

  • No Favourites found!