నా యన్న రాఁగదే ఓ యేసు తండ్రి నా యన్న రాఁగదే నా ప్రాణ
ధనమా నా పట్టుకొమ్మా నా ముద్దు మూట నా ముక్తిబాట నా యన్న
రాఁగదే నా యన్న సిలువలో నీ వాయాసపడిన నాఁటి నీ
యంఘ్రియుగమునిపుడు నా యాసఁదీరఁజూతు ||నా యన్న||
1. ఒక తోఁట లోపట నాఁడు పడిన సకల శ్రమ లిచ్చోట నికటమై
యున్నట్లుగా నిట్టూర్పులతోఁ దలంతు నకట నా రాతి గుండె శకలంబై
పోవునట్లుగా ||నా యన్న||
2. పరమాశ్చర్యము గాదా యీలాటి ప్రేమ ధరణిలో నున్నదా చురుకౌ
ముల్లుల పోట్లకు నీ శిరము నా వంటి నీచపు పురుగు కొరకం దిచ్చెడు నీ
కరుణన్ దర్శింతు నేఁడు ||నా యన్న||
3. ఇచ్చక మిది గాదు మిగులఁ దలపోయ ముచ్చట దీరదు అచ్చి వచ్చిన
నా యవతారుఁడ నీ ప్రక్క గ్రుచ్చు గాయము లోపల నేఁ జొచ్చి నీ
ప్రేమఁ జూతు ||నా యన్న||
4. తల వంచి సిగ్గున నేఁ జేయు నేర ముల నెంతు నాలోనఁ బలు మారు
నీ గాయములఁ గెలికి నిన్ శ్రమపరచు నా ఖల దోషములకై యిపుడు
పిలిపించి వేఁడుకొందు ||నా యన్న||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నా యన్న రాఁగదే ఓ యేసు Lyrics
Your favourites
- No Favourites found!
