Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా యేసు మార్గమందున వెళ్ళ నాయత్తమా?గొల్గొతాకొండ Telugu Christian Song Lyrics

నా యేసు మార్గమందున వెళ్ళ నాయత్తమా?గొల్గొతాకొండ Lyrics

1. నా యేసు మార్గమందున వెళ్ళ నాయత్తమా?
గొల్గొతాకొండ బాధలో - పాలు పొందెదవా?
సిలువను వీడను - సిలువను వీడను
సిలువను వీడను సిలువను వీడను - సిలువను వీడను
సిలువను సిలువను వీడను
2. బంధుమిత్రుల మధ్యను శ్రమ సహింతువా?
మూర్ఖ కోపిష్టుల మధ్య దిట్టముగ నుందువా?
3. ఆకలి దాహ బాధలో ధైర్యంబుగ నిల్తువా?
అవమానము వచ్చినన్ - సిల్వను మోతువా?
4. పాపాత్ములు గుణపడన్ - దత్తము చేతువా?
భయస్థులు ధైర్యపడన్ - యుద్ధము చేతువా?
5. లోకులు నాశమైరిగా - వీరులు లేకయే
విమోచకుడు సిల్వలో - వ్రేలాడి మృతి పొందెను
6. జీవాంతరము వరకు - నిల్చిపోరుసల్పి
దైవకృపచే గెల్చి నే - మోక్షము చేరుదున్


Your favourites

  • No Favourites found!