నా యేసు! నా యాత్మ బలమా! నీదు గాయంబులే నిలువబలమైన స్థలము
సకల సృష్టి పునాదియపుడే నాదు సకల పాపములకై బలియైతి వేసు!
సకల భూమ్యాకాశములను సమము గా గతించినఁగాని నీ ప్రేమ
నిలుచు ||నా||
1. నా తండ్రి! నీ నిత్య కృపను నెంచ నా తరమ? నీ ప్రేమ హస్తముల జూచి
పాతకుల రండంచు బిలిచి వేగ నీదు కృప రుచి జీవంబు నిచ్చు ||నా||
2. దరిలేని లోతైన ప్రేమా! నీలో దురిత యెల్లను మునిఁగి పోవు
దరిలేని యుచిత కృపఁ జాటు నీదు రక్తంబు నా పాపడాగులను గడిగె
||నా||
3. ఈ ప్రేమ సాగరంబున నే దుమికి నా ప్రభుని యెదదూరి విశ్రాంతి
నొంది యే ప్రొద్దు సంతసించెదను నన్ను నా ప్రాణమును డాయదిఁక
నరక మొందు ||నా||
4. నా శిరముపై నలలురేగి యిలను నా సత్తువయు స్నేహితులు నన్ను
వీడి నా సుఖము నా సంతసము బోయి నను నీదు కృప నన్ను
విడిపోదు తండ్రీ ||నా||
5. నా హృదయమే నిలిచిపోనీ నాదు శరీరమే కుళ్ళి నీరైన గానీ ధర
పునాదులే కరిగిపోనీ యేసు నిరతంబు నీ ప్రేమ నిలుచు నను బ్రోచు ||నా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నా యేసు! నా యాత్మ బలమా! Lyrics
Your favourites
- No Favourites found!
