Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నాదు హృదయపు ద్వారము తెరచెదను యేసు Telugu Christian Song Lyrics

నాదు హృదయపు ద్వారము తెరచెదను యేసు Lyrics

నాదు హృదయపు ద్వారము తెరచెదను
యేసు పాపపు రోగికి నీవే గతి
1. యేసు చచ్చిన వారిని లేపితివే - మరి కుంటికి కాళ్ళను ఇచ్చితివే
నేను పాపిని రోగిని నీవేగతి - నాకు దిక్కిక లేదిక వేరెక్కడ
2. ప్రభు కుష్ఠును ప్రేమతో ముట్టితివి - మరి దుష్టుల చెంతను చేరితివి
నాదు పాపపు కుష్ఠును పారద్రోలి - పరిశుద్ధత నియ్యుము నీవేగతి
3. యాయీరు కుమార్తెను లేపితివి - మరి మృతుడగు లాజరు బ్రతికెనుగా
నేను చచ్చిన పాపిని శరణు ప్రభూ నాకు వేరొక మార్గము లేదికను
4. ప్రభు మార్గము ప్రక్కన కూర్చొనిన - ఆ అంధుని ధ్వనిని వింటివిగా
నేను పాపిని అంధుని యేసూ ప్రభూ - నను దాటకు దిక్కిక లేదు ప్రభూ


Your favourites

  • No Favourites found!