Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నాదు ప్రాణమా నాదు ప్రాణమా దేవుని Telugu Christian Song Lyrics

నాదు ప్రాణమా నాదు ప్రాణమా దేవుని Lyrics

నాదు ప్రాణమా నాదు ప్రాణమా
దేవుని క్రియల్మరువకుమా
ఆయన చేసిన దేనిన్ మరువకుమా
1. వ్యర్థుడనై నాశనంబౌ నిన్ను రక్షించి
మోక్షనగరు చేర్చను తనదు ప్రాణమిచ్చెనే
ఓ నా మనసా యెంతటి ప్రేమా
దేవుని క్రియల్మరువకుమా - నీ
2. ప్రియులులేక భ్రమసి నీవు పరుడవైనపుడు
ప్రయుడేసు నిన్ను జేరి సంతసంబిడెనే
సమర్పించు సర్వము తనకే
దేవుని క్రియల్మరువకుమా - నీ
3. రక్షణాలం కారవస్త్రము జీవాహారము
శాంతి సమాధానము నీతి నీకు నిచ్చెనే
ప్రేమ పరిమళ స్తుతులను పాడి
దేవుని క్రియల్మరువకుమా - నీ
4. గెత్సేమనెలో కార్చె నేసు రక్త చెమటలను
వేదనతో విజ్ఞాపనము నీ కొరకు చేసెన్
వినుమా మనసా యేడ్చెను నీకై
దేవుని క్రియల్మరువకుమా - నీ
5. వచ్చెదననిన కాలమాయె తామసం బేల
పభుని రాక బూరధ్వనించు కాలమెప్పుడో
ఆశతో ప్రభుని రాకడకోరి
దేవుని క్రియల్మరువకుమా - నీ


Your favourites

  • No Favourites found!