నాదు ప్రాణము ప్రభుని మిగుల ఘ నంబు చేయుచున్నది నాదు నాత్మ
దేవునం దా నం మొందెను నిరతము ||నాదు||
1. దేవుఁడు తన భృత్యురాలి దీనస్థితి లక్షించెను ఈ వసుంధరఁ దరము
లన్నిఁక నెన్ను నను శుభవతి యని ||నాదు||
2. సర్వ శక్తుఁడు మహాకృత్యము సంభవింపఁ జేసెను ఉర్విలో నా ప్రభుని
నామం బోప్పు బరిశుద్ధంబుగా ||నాదు||
3. భయము భక్తియుఁ గల్గి దేవుని భజనఁ జేసెడి వారికి నయముగాఁ
దన కృప నొసంగు న నయమును దరతరములు ||నాదు||
4. విదిత బాహువు చేత శౌర్యము విభుఁడు కనపర్చెను హృదయపుఁ
దలఁపులను గర్వులఁ జెదరఁ గొట్టెను నిజముగ ||నాదు||
5. ఆసనాసీనులై యున్న యతిశయాత్ములన్ బడఁ ద్రోసి దేవుఁడు దీనులను
సిం హాసనంబుల నునిచెను ||నాదు||
6. క్షుధితులను దన మధురములచేఁ గోరి తృప్తి పర్చెను అధిక
ధనవంతులను రిక్త హస్తములతో ననిపెను ||నాదు||
7. ఆది పితరులైన యబ్రా హాము కతని సంతున కద్వితీయుఁ డాదిలోక
నాన తిచ్చినట్లుగా ||నాదు||
8. నిరతమును దన కరుణఁ జూప నిజముగా మది నెంచెను వరదుఁ
డిశ్రాయేలునకుఁ దన వర సహాయ మొనర్చెను ||నాదు||
9. పరమ తండ్రికి దైవ సుతునకు పావనాత్మకు నిఁక నిహ పరమ
లందును యుగయుగంబులఁ బరఁగు మహిమ మామేన్ ||నాదు||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నాదు ప్రాణము ప్రభుని మిగుల ఘ Lyrics
Your favourites
- No Favourites found!
