Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా(డు వచ్చినట్లు గాదు నేఁడు వచ్చుట Telugu Christian Song Lyrics

నా(డు వచ్చినట్లు గాదు నేఁడు వచ్చుట Lyrics

నా(డు వచ్చినట్లు గాదు నేఁడు వచ్చుట తేరి చూడరాదు క్రీస్తు
నింకఁ జొత్తు మెచ్చుట ||నాఁడు||

1. మొదట గొఱ్ఱెపిల్ల రీతి నొదిగి వచ్చెఁగా యిపుడు కొదమ సింహమయ్యె
మనకు గుండె దిగులుగా ||నాఁడు||

2. దాసునివలె దొల్లిఁ జూచినాముగా యిపుడు దోసము లెంచి దండింప
దొరయైనాఁడుగా ||నాఁడు||

3. ఏ తట్టు బోయిన మనకు నెదురు వచ్చెఁగా పిడుగు రీతి వాని
యుగ్రమైన దృష్టి హెచ్చఁగా ||నాఁడు||

4. కొండ వండ లందు డాగి యుండలేముగా వాని యండనుండి
మండు నగ్ని యదిగో వచ్చెఁగా ||నాఁడు||

5. దిక్కుగా నున్నట్లు నితర దేవతలను నమ్మి వట్టి పుక్కిటి పురాణములకుఁ
బోయి చెడితిమి ||నాఁడు||

6. వీధుల బోధించు వారి వినక పోతిమి యిపుడు బాధఁ బొంది
నరకాగ్నిలోఁ బడఁబాలైతిమి ||నాఁడు||

Your favourites

  • No Favourites found!