Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నాకేమి కొదువ నాధుఁడుండ నిఁక శ్రీకరుండగు Telugu Christian Song Lyrics

నాకేమి కొదువ నాధుఁడుండ నిఁక శ్రీకరుండగు Lyrics

నాకేమి కొదువ నాధుఁడుండ నిఁక శ్రీకరుండగు దేవుడే నా
శ్రేష్ట పాలకుఁడు నా యేక రక్షకుఁడు గనుక ||నాకేమి||

1.
తనివి దీర మేళ్లనుభవింప నేను నను సదా మేళ్లనెడి పచ్చిక
నదిమి మృదువుగఁ బండు కొనఁజేయును గనుక ||నాకేమి||

2.
ఎంత శోధన యెండ యున్న నాకు నెంతకు నోరిగర దెపుదు
శాంత జలములు నా చెంతనే యుండు గనుక ||నాకేమి||

3.
తప్పిపోయిన నన్ దారిం బెట్టి నన్ను తెప్పరిల్లఁజేసి నాకుఁ దీరు
నలసటను నా తప్పు మన్నించున్ కనుక ||నాకేమి||

4.
నీతి మార్గమునన్ నిల్పున్ నన్ను ప్రభువు నీతి లేని నాకుఁ దనను
నీతి దయ చేయున్ స్వ నీతిని ద్రుంచున్ గనుక ||నాకేమి||

5.
చావు చీఁకట్ల శక్తియుండు ఆహా లోయలోఁబడి పోవలసినను
నే వెరవకుందు నా దేవుండే తోడు గనుక ||నాకేమి||

6.
మీఁదఁబడునట్టి శోధనలన్ ధరను నా దరికి రానీక దండము
నన్ను బ్రోచుచును నా కాదరణ యౌను గనుక ||నాకేమి||

7.
పగవారల్ సిగ్గు పడునట్లుగ నా జగము యెరుఁగని సౌఖ్యభో జన
మగపరుచును హా తగినదే పెట్టున్ గనుక ||నాకేమి||

8.
తన యాత్మానంద తైలంబుతో ప్రభువు ననుదినము తలయంటి
విసుగ కొనక తుడుచును నా కన్నీళ్లన్ని గనుక ||నాకేమి||

9.
పలువిధములైన భాగ్యములతో తండ్రి వెలుపలికి దిగవెడలునట్టి వెల
గల గిన్నె నా కలిమిగాఁ జేయున్ గనుక ||నాకేమి||

10.
బ్రదుకంతటన్ గృ పాక్షేమములు నా వదలకుండగ వచ్చు
నాతో సుదినములు గల్గ నా పదలు సంపదలౌ గనుక ||నాకేమి||

11.
దురితంబు లుండు ధరణి నాకు నిజము నిరవు కాఁదిక నెప్పటికి
నా పరమ దేవుని మందిరమె నా యిల్లు గనుక ||నాకేమి||

Your favourites

  • No Favourites found!