Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నాకెన్నో మేలులు చేసితివేనీకేమి చెల్లింతును Telugu Christian Song Lyrics

నాకెన్నో మేలులు చేసితివేనీకేమి చెల్లింతును Lyrics

నాకెన్నో మేలులు చేసితివే
నీకేమి చెల్లింతును – దేవా నీకేమి అర్పింతును (2)
హల్లెలూయా యేసునాథా – కృతజ్ఞతా స్తుతులివే (2) ||నాకెన్నో||
కృప చేత నన్ను రక్షించినావే
కృప వెంబడి కృపతో – నను బలపరచితివే
నన్నెంతగానో ప్రేమించినావే
నా పాపమును కడిగి – పరిశద్ధపరచితివే (2) ||హల్లెలూయా||
నాకిక ఆశలు లేవనుకొనగా
నా ఆశ నీవైతివే – ఆశలు తీర్చితివే
నలుదిశల నన్ను భయమావరింప
నా పక్షమందుంటివే – నాకభయమిచ్చితివే (2) ||హల్లెలూయా||
నా కాడి మోసి నా తోడు నీవే
నీ చేతి నీడలో – నను దాచియున్నావే
ఏ కీడు నాకు రాకుండ చేసి
నీ జాడలో నన్ను- నడిపించుచున్నావే (2) ||హల్లెలూయా||
నీ రాజ్యమందు నను చేర్చుకొందువు
రానున్న రారాజువు – నా రాజువు నీవు
నీ వధువు సంఘమున నను చేర్చుకొన్నావు
నను కొన్నవాడవు – నా వరుడవు నీవు (2) ||హల్లెలూయా||

Your favourites

  • No Favourites found!