నాకొరకై అన్నియు చేసెను యేసు
నాకింక భయము లేదు లోకములో
అను నాకొరకై అన్నియు చేసినందులకు
నేను రక్షణ పాత్రను యెత్తి ఆరాధించెదన్
1. క్షామమందు ఏలేయాకు అప్పమించెను
క్షామంతీర్చి ఏలీయను ఆశీర్వదించెన్
క్షామం తీరే వరకు ఆ విధవరాలి
ఇంట నూనెకైన పిండికైన కొరత లేదు
2. ఆకాశపక్షులను గమనించుడి
విత్తవు అవి పంటను కోయవు
వాటిని పోషించునట్టి ప్రమపితా - మమ్ము
అనుదిన మద్భుతంబుగా నడుపున్
3. ఏమి ధరింతుమని చింతపడకు
అడవి పుష్పములను తేరిచూడుము
అడవి పువ్వుల ప్రభు అలంకరింప - తానే
నిశ్చయంబుగా మమ్ము అలంకరించును
4. రేపటి దినము గూర్చి చింతపడకు
ఆప్తుడేసు నాకుండ భయమెందుకు
రేపుదాని సంగతులనదే చింతించున్ - ఏ
నాటికీడు ఆనాటికే ఇలచాలును
5. ఆశీర్వదించెడి యేసు అరణ్యములో
పోషించెను ఐదువేలమందిని కూడ
తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ - యేసు
తన్ను తానే అర్పించెను నా కొరకై
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నాకొరకై అన్నియు చేసెను యేసు నాకింక Lyrics
Your favourites
- No Favourites found!
