Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నాకు జీవమైనయున్న నా జీవమా నాకు Telugu Christian Song Lyrics

నాకు జీవమైనయున్న నా జీవమా నాకు Lyrics


నాకు జీవమైనయున్న నా జీవమా
నాకు ప్రాణమైయున్న నా ప్రాణమా
నాకు బలమైయున్న నా బలమా
నాకు సర్వమైయున్న నా సర్వమా
నీ నామమే పాడెదన్ నా జీవితకాలమంతా
నీ ధ్యానమే చేసెదన్ నా ఊపిరి ఉన్నంత వరకు

1. పూజ్యుడవు ఉన్నత దేవుడవు
యోగ్యుడవు పరిశుద్ధ రాజువు
నా ఆరాధన నా ఆలాపన నా స్తుతి కీర్తన నీవే
నా ఆలోచన నా ఆకర్షణ నా స్తోత్రార్పణ నీవే

2. నాయకుడా నా మంచి స్నేహితుడా
రక్షకుడా నా ప్రాణనధుడా
నా ఆనందం నా ఆలంబన నా అతిశయము నీవే
నా ఆదరణ నా ఆశ్రయము నా పోషకుడవు నీవే

Your favourites

  • No Favourites found!