Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నాతో మాట్లాడుమయ్యా – నన్ను దర్శించుమయ్యా Telugu Christian Song Lyrics

నాతో మాట్లాడుమయ్యా – నన్ను దర్శించుమయ్యా Lyrics

నాతో మాట్లాడుమయ్యా – నన్ను దర్శించుమయ్యా

నీ మందిరాన – నీ సన్నిధాన – నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా

నాతో మాట్లాడుమయ్యా..

యేసయ్యా.. యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా…..


1. కన్నీళ్ళైనా కష్టాలెదురైనా – కడవరకూ నను చేర్చుమయ్యా

కరువు తోడైనా – కలిమి వేరైనా – కరుణించి కాపాడుమయ్యా

నా వేదనలో నీ జాలితో – నా శోధనలో నీ చేతితో

నిత్యము నను నడిపించుమయ్యా..

యేసయ్యా.. యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా…..


2. నావారే నన్ను నిందించు వేళ – నను విడిచి పోబోకుమయ్యా

ఆదరణ నాకు – కరువైన వేళ – దరి చేరి ఒదార్చుమయ్యా

నా నిందలలో నా తోడువై – అపనిందలలో నా చేరువై

నిత్యము నను నడిపించుమయ్యా..

యేసయ్యా.. యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా…..


3. నా కాలు జారి తొట్రిల్లు వేళ – చేజార్చి నిలబెట్టుమయ్యా

సాతాను నన్ను – బంధించు వేళ – నను చేరి విడిపించుమయ్యా

నీ చేతితో నను పట్టుకో – నీ సేవలో నను వాడుకో

నిత్యము నను నడిపించుమయ్యా..

యేసయ్యా.. యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా…..


Your favourites

  • No Favourites found!