Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నాతో నీవు మాటాడినచోనే బ్రతికెదను ప్రభు Telugu Christian Song Lyrics

నాతో నీవు మాటాడినచోనే బ్రతికెదను ప్రభు Lyrics

నాతో నీవు మాటాడినచో
నే బ్రతికెదను ప్రభు (2)
నా ప్రియుడా నా హితుడా
నా ప్రాణ నాథుడా నా రక్షకా ||నాతో||
యుద్ధమందు నేను మిద్దె మీద నుంచి
చూడరాని దృశ్యం కనుల గాంచినాను (2)
బుద్ధి మీరినాను హద్దు మీరినాను
లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం
ఒక్క మాట చాలు… ఒక్క మాట చాలు
ఒక్క మాట చాలు ప్రభు ||నాతో||
కట్టబడితి నేను గట్టి త్రాళ్లతోను
వీడలేదు ఆత్మ వీడలేదు వ్రతము (2)
గ్రుడ్డి వాడనైతి గానుగీడ్చుచుంటి
దిక్కు లేక నేను దయను కోరుచుంటి
ఒక్క మాట చాలు… ఒక్క మాట చాలు
ఒక్క మాట చాలు ప్రభు ||నాతో||

Your favourites

  • No Favourites found!