నావన్ని అంగీకరించుమీ దేవా నన్నెపుడు నీవు కరుణించుమీ
నావన్ని కృపచేత నీవలన నొందిన భావంబునను నేను బహుదైర్యమొందెద
1. నీకు నా ప్రాణము నిజముగ నర్పించి నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద
2. సత్యంబు నీ ప్రేమ చక్కగా మధి బూని నిత్యంబు గరముల నీ సేవ జేసెద
3. నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు ఆశచే నడిపించు మరల నా పదములు
4. పెదవులతో నేను బెంపుగ నీ వార్త గదలక ప్రకటింప గలిగించు దృడభక్తి
5. నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీ యావంత యైనను నాశించ మదిలోన
6. నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే సేవ జేయగ నిమ్ము స్థిరభక్తితో నీకు
7. చిత్తము నీ కృపా యత్తంబు గావించి మత్తిల్ల కుండగ మార్గంబు దెలుపుము
8. హృదయంబు నీకిత్తు సదనంబు గావించి పదిలంబుగా దాని బట్టి కాపాడుము
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నావన్ని అంగీకరించుమీ దేవా నన్నెపుడు నీవు Lyrics
Your favourites
- No Favourites found!
