నావన్ని యంగీకరించుమీ దేవా నన్నెపుడు నీవు కరుణించుమీ
నావన్ని కృపచేత నీ వలన నొందిన భావంబునను నేను బహు ధైర్య
మొందెద ||నావన్ని||
1. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి నీకు మీఁదుఁగట్టి నీ కొరకు
నిల్పెద ||నావన్ని||
2. సత్యంబు నీ ప్రేమ చక్కఁగా మదిఁ బూని నిత్యంఉఁ గరముల నీ
సేవఁ జేసెద ||నావన్ని||
3. నీ సేవ జరిగెడు నీయాలయమునకు నాసచే నడిపించు మరల నా
పదములు ||నావన్ని||
4. పెదవులతో నేను బెంపుగ నీ వార్తఁ గదలక ప్రకటింపఁ గలి గించు
దృఢ భక్తి ||నావన్ని||
5. నా వెండి కనకంబు నా తండ్రి గైకొనుమీ యావంతయైనను
నాశింప మదిలోన ||నావన్ని||
6. నీవు నా కొసఁగిన నిర్మల బుద్ధిచే సేవఁ జేయఁగ నిమ్ము స్థిర భక్తితో
నీకు ||నావన్ని||
7. చిత్తము నీ కృపా యత్తంబు గావించి మత్తిల్లకుండఁగ మార్గంబుఁ
దెలుపుము ||నావన్ని||
8. హృదయంబు నీ కిత్తు సదనంబుగావించి పదిలంబుగా దానిఁ బట్టి
కాపాడుము ||నావన్ని||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నావన్ని యంగీకరించుమీ దేవా నన్నెపుడు నీవు Lyrics
Your favourites
- No Favourites found!
