Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నడిపించు చున్నాడు నజరేయుడునడక నేర్పుచున్నాడు నను Telugu Christian Song Lyrics

నడిపించు చున్నాడు నజరేయుడునడక నేర్పుచున్నాడు నను Lyrics

నడిపించు చున్నాడు - నజరేయుడు
నడక నేర్పుచున్నాడు - నను విడువని దేవుడు
గాఢాంధకారములైనా - కన్నీటి లోయలైనా
కష్టాల తీరములైన - కఠినమైన మార్గములైనా ||నడి||
1.నా కాళ్ళు తడబడగా - నడువ లేక నిలబడగా (2)
అడుగులో అడుగేసి - చేతిలో చెయ్యేసి (2)
ఊసుచెప్పినాడు - బాసచేసినాడు (2)
ఆదరించే దేవుడు నా యేసయ్యా ఆశీర్వదించే దేవుడు నా యేసయ్య ||సడి||
2.ముదిమిలో బలముడిగి - నిలువలేక తూలిపోగా (2)
చంకలో ఎత్తుకొని - ముద్దులతో ముంచెత్తి (2)
ప్రేమ చూపినాడు - ప్రాణమిచ్చినాడు (2)
ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా ||స||

Your favourites

  • No Favourites found!