Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నడిపించు నానావ నడిసంద్రమున దేవానవజీవన మార్గమున Telugu Christian Song Lyrics

నడిపించు నానావ నడిసంద్రమున దేవానవజీవన మార్గమున Lyrics

నడిపించు నానావ నడిసంద్రమున దేవా
నవజీవన మార్గమున నాజన్మ తరియింప ||నడిపించు||

1. నా జీవిత తీరమున నా యపజయ భారమున
నలిగిన నా హృదయమును నడిపించు లోతునకు
నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము నా సేవ జేకొనుము ||నడిపించు||

2. రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము
రహదారులు వెదకినను రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో
రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవ ||నడిపించు||

3. ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి
ఆశ నిరాశయే ఆవేద నెదురాయే
ఆథ్యాత్మిక లేమిగని అల్లాడె నావలలు ||నడిపించు||

4. ప్రభు మార్గమి విడచితిని ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని
ప్రపంచ నటనలో ప్రావీణ్యమును బొంది
ఫలహీనుడనై యిపుడు పాటింతు నీమాట ||నడిపించు||

5. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి లోపంబును సవరించి
లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు
లోపించని యర్పణగా లోకేశజేయుమయ ||నడిపించు||

6. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో పరిశుద్ధుని! ప్రేమకథ
పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు ప్రానార్పణము చేతు ||నడిపించు||

Your favourites

  • No Favourites found!