Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను Telugu Christian Song Lyrics

నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను Lyrics


నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు
అడుగులు తడబడినా అలసట పైబడినా
చేయితట్టి వెన్నుతట్టి చక్కని ఆలొచన చెప్పి (2)

1. అంధకారమే దారి మూసినా నిందలే నను కృంగదీసినా
తనచిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు

2. కష్టాల కొలిమి కాల్చివేసినా శోకాలు గుండెను చీల్చివేసినా
తనచిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు

3. నాకున్న కలిమి కరిగిపోయిన నాకున్న బలిమి తరిగిపోయిన
తనచిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు

Your favourites

  • No Favourites found!