Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నడిపిస్తాడు నాదేవుడు శ్రమలోనైనా నను విడువడుఅడుగులు Telugu Christian Song Lyrics

నడిపిస్తాడు నాదేవుడు శ్రమలోనైనా నను విడువడుఅడుగులు Lyrics

నడిపిస్తాడు నాదేవుడు
శ్రమలోనైనా నను విడువడు
అడుగులు తడబడినా అలసట పైబడినా (2)
చెయిపట్టి వెన్నుతట్టి చక్కకు ఆలోచన చెప్పి (2)
1.అంధకారమే దారిమూసినా -
నిందలె నన్ను కృంగదీసినా (2)
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యం వరకు నను చేర్చుతాడు ||నడిపిస్తాడు||
2.కష్టాలు కొలిమి కాల్చివేసిన
శోకాలు గుండెను చీల్చివేసినా
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యంవరకు నను చేర్చుతాడు ||నడిపిస్తాడు||
3.నాకున్న కలిమి కలిగిపోయినా
నాయొక్కబలిమి తరిగిపోయినా
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యంవరకు నను చేర్చుతాడు ||నడిపిస్తాడు||

Your favourites

  • No Favourites found!