Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నడిపిస్తాడు నా దేవుడు Telugu Christian Song Lyrics

నడిపిస్తాడు నా దేవుడు Lyrics


నడిపిస్తాడు నా దేవుడు – శ్రమలోనైనా నను విడువడు (2)
అడుగులు తడబడినా – అలసట పైబడినా (2)
చేయి పట్టి వెన్నుతట్టి – చక్కని ఆలొచన చెప్పి (2)         ||నడిపిస్తాడు||

అంధకారమే దారి మూసినా – నిందలే నను కృంగదీసినా (2)
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యం వరకు నను చేర్చుతాడు (2)        ||నడిపిస్తాడు||

కష్టాల కొలిమి కాల్చివేసినా – శోకాలు గుండెను చీల్చివేసినా (2)
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యం వరకు నను చేర్చుతాడు (2)        ||నడిపిస్తాడు||

నాకున్న కలిమి కరిగిపోయిన – నాకున్న బలిమి తరిగిపోయిన (2)
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యం వరకు నను చేర్చుతాడు (2)        ||నడిపిస్తాడు||

Your favourites

  • No Favourites found!