నజరేయుడా నా యేసయ్య
ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని
గళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా||
ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2)
శూన్యములో ఈ భూమిని
వ్రేలాడదీసిన నా యేసయ్య (2)
నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2)
జలములలోబడి నే వెళ్ళినా
నన్నేమి చేయవు నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2)
సీయోనులో నిను చూడాలని
ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నజరేయుడా నా యేసయ్యఎన్ని యుగాలకైనాఆరాధ్య దైవము Lyrics
Your favourites
- No Favourites found!
