Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నజరేయుడా నా యేసయ్య ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము Telugu Christian Song Lyrics

నజరేయుడా నా యేసయ్య ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము Lyrics

నజరేయుడా నా యేసయ్య
ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని
గళమెత్తి నీ కీర్తి నే చాటెద
||నజరేయుడా||

1. ఆకాశ గగనాలను
నీ జేనతో కొలిచితివి (2)
శూన్యములో ఈ భూమిని
వ్రేలాడదీసిన నా యేసయ్య (2)
నీకే వందనం నీకే వందనం (2)
||నజరేయుడా||

2. అగాధ సముద్రాలకు
నీవే ఎల్లలు వేసితివి (2)
జలములలోబడి నే వెళ్ళినా
నన్నేమి చేయవు నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2)
||నజరేయుడా||

3. సీయోను శిఖరాగ్రము
నీ సింహాసనమాయెనా (2)
సీయోనులో నిను చూడాలని
ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2)
||నజరేయుడా||

Your favourites

  • No Favourites found!