Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నలుగకుండ గోధుమలు కడుపు నింపగలుగునాకరగకుండ కొవ్వొత్తి Telugu Christian Song Lyrics

నలుగకుండ గోధుమలు కడుపు నింపగలుగునాకరగకుండ కొవ్వొత్తి Lyrics

నలుగకుండ గోధుమలు కడుపు నింపగలుగునా
కరగకుండ కొవ్వొత్తి కాంతి నివ్వగలుగునా
ఆత్మీయ యాత్రలో నలుగుటయే విలువయా
ఇరుకైన బాటలో కరుగుటయే వెలుగయా
పగలని బండనుండి జలములు ఊరునా
విరుగని పొలము మనకు పంటలీవ్వగలుగునా
పరలోకయాత్రలో పగులుటయే ఫలమయా
విశ్వాసి బాటలో విరుగుటయే వరమయా
రక్తము చిందకుండ పాపములు పోవునా
కన్నీరు కార్చకుండ కలుషములు కరుగునా
అంతిమ యాత్రలో క్రీస్తేసే గమ్యమయా
బహుదూర బాటలో ప్రభు యేసే శరణమయా

Your favourites

  • No Favourites found!