Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నమ్మదగినవాడవు నెమ్మదిని చేకూర్చను యిమ్మహిలో యెంతైనను Telugu Christian Song Lyrics

నమ్మదగినవాడవు నెమ్మదిని చేకూర్చను యిమ్మహిలో యెంతైనను Lyrics

నమ్మదగినవాడవు - నెమ్మదిని చేకూర్చను
యిమ్మహిలో యెంతైనను - నమ్మిన నను గాచెడి
1. అలలు గాలి తుఫానులవలె - శ్రమలు నన్నిలగొట్టిన
అమరమందు నిల్చియేసు - అన్నిటిని గద్దించును
2. నరుల రాజులనమ్మిన - నిరుపయోగమె యెందున
కరము జాచిన కష్టములలో - కొరతలన్నిటి తీర్చును
3. యాత్రికులు ప్రయాణికులుగా - యాతనలు మే బొందిన
నూతన జీవముతో నీ - పాత్రలుగను వాడను
4. ఆత్మ జీవశరీరములను - ప్రభువు రాకడయందున
నిందారహిత సంపూర్ణమహిమలో - నుండునట్లుగ నిల్పను
5. పరమ తండ్రి కృపాతిశయమును - నిరతమును కీర్తించెద
తరములకు విశ్వాస్యతను నా - నోటితోనే తెల్పెద
6. శోధనలన్నీ సహించెడి - వరకె నా కవినిచ్చియు
శోధనలు తప్పించుకొను యా - మార్గమును కలిగించుము


Your favourites

  • No Favourites found!