Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నమ్మకమైన నా ప్రభు నిన్ను నే Telugu Christian Song Lyrics

నమ్మకమైన నా ప్రభు నిన్ను నే Lyrics

నమ్మకమైన నా ప్రభు
నిన్ను నే స్తుతింతును - నిన్ను నే స్తుతింతును
1. కరుణతోడ - పిల్చియు - స్థిరపరచి కాపాడిన
స్థిరపరచిన - నా ప్రభున్ - పొగడి - నే స్తుతింతును
2. ఎన్నోసార్లు నీ కృపన్ - విడచియుంటినో ప్రభు
మన్ననతోడ - నీదరిన్ చేర్చినన్ క్షమించితివి
3. కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి
భంగ పర్చు - సైతానున్ - గెల్చి విజయమిచ్చితివి
4. నా కాశ్రయశైలమై - కోటగా నీవుంటివి
ప్రాకారంపు - యింటివై - నన్ను దాచియుంచితివి
5. సత్య సాక్షివై యుండి - నమ్మదగినవాడవై
నిత్యుడౌ మా దేవుడా - ఆమేనించు పాడెద


Your favourites

  • No Favourites found!