Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నమ్మకు ఇలలో ఎవరినిసాయం చేస్తారనుకొని నమ్ముకో Telugu Christian Song Lyrics

నమ్మకు ఇలలో ఎవరినిసాయం చేస్తారనుకొని నమ్ముకో Lyrics

నమ్మకు ఇలలో ఎవరిని
సాయం చేస్తారనుకొని (2)
నమ్ముకో రక్షకుడేసుని (2)
కార్యం చూడు నిలుచొని (2) ||నమ్మకు||
సహాయము చేస్తామని వస్తారు ఎందరో నీ చెంతకు
చేయూతను ఇస్తామని చెప్తారు ఎన్నో కబుర్లు నీకు
అక్కరలడ్డం పెట్టుకొని లాభం పొందుతుంటారు (2)
శవాలపై కాసులేరాలని కాచుకొని చూస్తుంటారు (2) ||నమ్మకు||
నీ ఆపదను తెలుసుకొని ప్రత్యక్షమౌతారు వెనువెంటనే
మేముండగా నీకేమని వెన్నంటి ఉంటారు నీ ఇంటనే
నీకున్న అవసరతలన్ని వారిపై వేసుకుంటారు (2)
దోచుకొని నీ సర్వస్వం ఇరుకులోన పెడుతుంటారు (2) ||నమ్మకు||
నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు నీ సంగతి
జవాబును చూపిస్తామని పేలుస్తు ఉంటారులే కుంపటి
సమస్య రూపం మార్చేసి లేని రంగు పూస్తుంటారు (2)
రహస్యాలను బయటేసి నిను అల్లరి చేస్తుంటారు (2) ||నమ్మకు||

Your favourites

  • No Favourites found!