నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా నీవు కన్న
తండ్రి వనుచు నేను నిన్ను ఁ జేరితి నాయనా ||నన్ను||
1. దూరమునకుఁ బోయి నీ దరిఁ జేర నైతిని నాయనా నేను కారు
మూర్ఖపు పిల్లనై కా రడవిఁ దిరిగితి నాయనా ||నన్ను||
2. మంచి మార్గము లేదు నాలో మరణ పాత్రుండ నాయనా నేను వంచితుండ
నైతిని ప్ర పంచమందున నాయనా ||నన్ను||
3. చాల మారులు తప్పిపోతిని మేలు గానక నాయనా నా చాల మొఱల
నాలకించుము జాలిగల నా నాయనా ||నన్ను||
4. జ్ఞాన మంతయుఁ బాడుచేసి కాన నైతిని నాయనా నీవు జ్ఞానము గల
తండ్రి వంచు జ్ఞప్తి వచ్చెను నాయనా ||నన్ను||
5. కొద్ది నరుఁడను దిద్ది నను నీ యొద్దఁ జేర్చుము నాయనా నీ యొద్దఁ
జేర్చి బుద్ధి చెప్పుము మొద్దు నైతిని నాయనా ||నన్ను||
6. ఎక్కడను నీవంటి మార్గము నెఱుఁగ నైతిని నాయనా నీ ఱెక్క
చాటున నన్ను ఁ జేర్చి చక్కపరచుము నాయనా ||నన్ను||
7. శత్రువగు సాతాను నన్ను మిత్రు ఁ జేయను నాయనా యెన్నో సూత్రములు
గల్పించెను నా నేత్రముల కో నాయనా ||నన్ను||
8. వాసిగా నేఁ బాపలోకపు వాసుఁడ నో నాయనా నీ దాసులలో
నొకనిగా ననుఁ జేసి కావుము నాయనా ||నన్ను||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు Lyrics
Your favourites
- No Favourites found!
