నన్ను ఁ గన్నయ్య రావె నా యేసు నన్నుఁ గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను||
1. ముందు నీ పాదారవిందము లందు నిశ్చల భక్తి ప్రేమను పొంది కగాఁ
జేయ రావే నా డెంద మానంద మనంతమై యుప్పొంగ ||నన్ను||
2. హద్దులేనట్టి దురాశల నవివేకినై కూడి యాడితి మొద్దులతో నింకఁ
కూటమి వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను||
3. కాలము పెక్కు గతించెను గర్వాదు లెడఁదెగ వాయెను ఈ లోక మాయ
సుఖేచ్ఛలు చాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను||
4. దారుణ సంసార వారథి దరిఁ జూపి ప్రోవ నీ కన్నను కారణ గురువు
లింకెవ్వరు లేరయ్య లేరయ్య లేరయ్య తండ్రి ||నన్ను||
5. నా వంటి దుష్కరమ్మజీవినిఁ కేవల మగు నీదు పేర్మిని దీవించి రక్షింప
నిప్పుడే రావయ్య రావయ్య రావయ్య తండ్రి ||నన్ను||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నన్ను ఁ గన్నయ్య రావె నా Lyrics
Your favourites
- No Favourites found!
