నన్ను విడువక – నాతో వస్తున్నా
మరువక – దీవిస్తానన్నా
యేసయ్య నాతో ఉండగా
ఈ వత్సరమే ఓ .. పండగ
హల్లేలూయా – హల్లేలూయా
హల్లేలూయా – హల్లేలూయా || నన్ను ||
1. ప్రతి దినమూ ప్రతి క్షణమూ
ప్రాణంగా ప్రేమిస్తాడన్నా
ప్రతి పనిలో తోడుండి
ప్రతిఫలమే ఇస్తాడన్నా
నీడైనా వీడిననూ
నావెంటే వుంటాడన్నా
చేతులలో చెక్కుకొని
నిత్యము నన్ను గమనించే… ॥యేసయ్య …॥
2. అపజయమే లేకుండా
విజయమునే ఇస్తాడన్నా
అడ్డులనే తొలగించి
అద్దరికే చేరుస్తాడన్నా
ఆపదలు ఎన్నున్నా
అన్నీ అణిచి వేస్తాడన్నా
శత్రువులే లేచిననూ
నా పక్షమున పోరాడే… ॥యేసయ్య …॥
రచన: డా|| పి .సతీష్ కుమార్ గారు
గానం: సాహస్ ప్రిన్స్ , అనూప్ రూబెన్స్
