Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నశియించెడి లోకంలో Telugu Christian Song Lyrics

నశియించెడి లోకంలో Lyrics


నశియించెడి లోకంలో – వసియించవు కలకాలం
మేలైనది చేపట్టి – సాగించు నీ పయనం – (2)
అది నాదంటూ ఇది నాదంటూ – ఆనందం కోల్పోతూ
పరమార్ధం గ్రహియించకనే – గతియించిపోతావా         ||నశియించెడి||

కాలంతో పాటుగా కృశియించును శరీరం
మరణం కబళించును ఏ ఘడియలోనైనా (2)
క్రీస్తు దారిలో సాగి – నిత్య రాజ్యమే చేరి (2)
వసియించు కలకాలం – సత్యమైన లోకంలో         ||నశియించెడి||

నిలచిపోవును మహిలోన బంధాలన్ని
మట్టిలో కలియును దేహం రిక్త హస్తాలతో (2)
ఇకనైనా తేరుకొని – గ్రహియించు సత్యాన్ని (2)
యేసులోకి మళ్ళించు – నీ జీవిత గమనాన్ని         ||నశియించెడి||

Your favourites

  • No Favourites found!