Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నే బ్రతికి ఉన్నానంటే – అది Telugu Christian Song Lyrics

నే బ్రతికి ఉన్నానంటే – అది Lyrics

నే బ్రతికి ఉన్నానంటే – అది కేవలం నీ కృప
ఈ స్థితిలో ఉన్నానంటే – అది క్రీస్తు మహా కృప (2)
నీ ప్రేమ బలమైనది
నీ మాట విలువైనది (2)        ||నే బ్రతికి||

లోకములో నేనుండగా
నీ కరములు చాపి పిలిచావయ్యా
దుఃఖములో నేనుండగా
నన్ను ఓదార్చినావు నా యేసయ్యా (2)
నా ఆధారము నీవే
నా ఆశ్రయము నీవే (2)        ||నే బ్రతికి||

నా వారలే నన్ను నిందించినా
నా బంధువులే నన్ను వెలివేసినా (4)
ఎవరున్నా లేకున్ననూ
నీ తోడు చాలునయ్యా
ఏమున్నా లేకున్ననూ
నీ కృపయే చాలునయ్యా        ||నే బ్రతికి||

నా స్థితి నీవు చూసావయ్యా
నా గతినే నీవు మార్చావయ్యా (2)
నా ఆధారము నీవే
నా ఆశ్రయము నీవే (2)        ||నే బ్రతికి||

Your favourites

  • No Favourites found!