Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీ కృపాతిశయమును అనునిత్యము నే Telugu Christian Song Lyrics

నీ కృపాతిశయమును అనునిత్యము నే Lyrics

నీ కృపాతిశయమును అనునిత్యము
నే కీర్తించెదా తరతరములకు
నీ విశ్వాస్యతను నే ప్రచురింతును

నీ కృపా నీ కృపా ఆకాశముకంటే హెచ్చైనది (2)
మౌనిగా యెటులుండెదా సాక్షిగా ప్రచురించకా
నా తుది శ్వాస వరకు నీ చెంత చేరేవరకు  (2)

1. ఇంకా బ్రతికి ఉన్నామంటే – కేవలము నీ కృపా
ఇంకా సేవలో ఉన్నామంటే – కేవలము నీ కృపా
ఏ మంచితనము – లేకున్ననూ  (2)
కొనసాగించినది నీ కృపా నిలబెట్టుకొన్నది నీ కృపా
                                                    ||నీ కృపా||
పది తరములుగా వెంటాడిన మోయాబు శాపము
నీ కృపను శరణు వేడగా మార్చే నే వేయి తరములు
అన్యురాలైన ఆ రూతును ధన్యురాలుగా మార్చినది
నీ కృపయే నను దీవించగా
ఏ శాపము నాపై పనిచేయదు”      ||నీ కృపా||

2. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా
మెతుకు బ్రతుకు ఉన్నాయంటే – కేవలము నీ కృపా
కృపతోనే రక్షణనిచ్చావు – నా క్రియల వలన కానే కాదు
జీవితమంతా ఋణస్థుడను
నీయందే నిత్యము అతిశయము      ||నీ కృపా||

3. ఇల్లు వాహనం ఉన్నాయంటే – నీదు కృపాదానమే
బలము ధనము ఉన్నాయంటే – నీదు కృపాదానమే
ఏ అర్హత నాలో లేకున్ననూ కృపా భిక్షయే నా యెడల
జీవితమంతా కృతజ్ఞుడను
జీవితమంతా పాడెదను                 ||నీ కృపా||

4. ప్రియులే నన్ను విడనాడినా – శోకమే నా లోకమా
అనాధగానే మిగిలానే – నా కథ ముగిసినదే
నీ కుడిచేతిలో ఉంచగనే బెన్యామీను వంతుగా మారే
ఐదంతలాయే నా భాగ్యము
విధిరాతనే మార్చెనే నీ కృపా          ||నీ కృపా||

Your favourites

  • No Favourites found!