నీ సిలువ వలన సంహారమాయెను
అంతవరకున్న ద్వేషం (2)
తొలగించబడెను మధ్య అవరోధం (2)
చేసితివి ఉభయులను ఏకం (2)
స్తోత్రాల ధూపం ఆత్మీయ గానం
యేసూ నీకే అర్పితం || నీ సిలువ ||
1. జీవాధిపతివైన యేసూ నిను
మరణముగ చేసింది ఆ సిలువయే (2)
చావునకు లోనైన ఈ పాపికి (2)
అక్షయత కలిగించెనే || స్తోత్రాల ||
2. దీవెనల నెలవైన యేసూ నిను
శాపముగ చేసింది ఆ సిలువయే (2)
శాపగ్రస్తుడనైన ఈ పాపికి (2)
ఆశీర్వచనమిచ్చెనే || స్తోత్రాల ||
3. ఐశ్వర్యనిధివైన యేసూ నిను
దీనునిగ చేసింది ఆ సిలువయే (2)
దారిద్య్రమందున్న ఈ పాపికి (2)
భాగ్యమును సమకూర్చెనే || స్తోత్రాల ||
నీ సిలువ వలన Song Audio
