నే స్తుతించెదను యేసు నామమును - భజించెదను క్రీస్తు నామమును
స్తుతికి యేసే యోగ్యుడని - నిత్యం నిత్యం నే స్తుతించెదను
1. ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ - వర్ణింప నెవ్వరికి తరమౌనా?
పాపిని నన్ను రక్షించుటకై - చూపేను ప్రేమన పారముగా
2. పాపములన్నియు బాపుటకై - శాపములన్నియు మాపుటకై
ఏ పాపమెరుగని ఆ పావనుడు - శాపగ్రాహియై చావొందెను
3. శోధన కాలముల యందున - వేదన కాలముల యందున
నాధుడు యేసు మనతోడనుండ - అంతమేగా మన చింతలకు
4. ఎనలేని ప్రేమతో కౌగిలించెను - ఎంచలేని మేళ్ళతో నన్ను నింపెను
మహామహుండు మహిమ ప్రధానుడు - మహిమతో వచ్చును మేఘముపై
5. రాజాధిరాజు ప్రభు యేసే - దేవాదిదేవుడు మన యేసే
పరమందు దూతలు యిహమందు నరులు - పాడుడి ప్రభునకు హల్లెలూయా
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నే స్తుతించెదను యేసు నామమును భజించెదను Lyrics
Your favourites
- No Favourites found!
